Mohan Babu: మోహన్ బాబు నోటీసులకు స్పందించకపోతే అరెస్ట్- సీపీ 6 d ago
మోహన్‌బాబు వివాదంపై రాచకొండ సీపీ సుధీర్‌బాబు స్పందించారు.మోహన్‌బాబు, మనోజ్ వివాదంలో 3 FIRలు నమోదు చేశామని తెలిపారు. మోహన్‌బాబు అరెస్ట్ విషయంలో ఆలస్యం లేదని, మోహన్‌బాబు దగ్గర మెడికల్ రిపోర్ట్ తీసుకోవాలని అన్నారు. మోహన్‌బాబుకు నోటీసులు ఇచ్చామని, ఈ నెల 24 వరకు సమయం అడిగారని సీపీ సుధీర్‌బాబు చెప్పారు. 24 లోపు విచారించడంపై కోర్టును అడుగుతామని పేర్కొన్నారు. రాచకొండ పరిధిలో మోహన్‌బాబుకు గన్ లైసెన్స్ లేదని, మోహన్‌బాబు దగ్గర రెండు గన్స్ ఉన్నాయని చెప్పారు. డబుల్ బ్యారెల్, స్పానిష్ మేడ్ రివాల్వర్ ఉందని, మోహన్‌బాబుకు మరోసారి నోటీసులు ఇస్తామని, నోటీసులకు స్పందించకపోతే అరెస్ట్ చేస్తామని రాచకొండ సీపీ సుధీర్‌బాబు స్పష్టం చేశారు. మరోవైపు ఇవాళే తన గన్ ను మోహన్ బాబు పోలీసులకు సరెండర్ చేశారు.